దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు

  • విద్యుత్ భారాన్ని ప్రజలపై పడనివ్వం
  • మంత్రి అచ్చెన్నాయుడు

విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తు ప్రజల మన్ననలను పొందుతోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ… ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోంది. గడిచిన ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం ఎదుర్కొంది. విద్యుత్ అనేది ప్రభుత్వానికి రాజకీయ అస్త్రం కాదు, ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక మౌలిక రంగం. అలాంటి రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో అప్పులపాలు చేశారు. 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారు. కానీ జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి, తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి దాదాపు రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం మోపాడు. విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడు. కమీషన్ల కోసం విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఈ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని రూ.1.29 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారు.

WhatsApp Join Now
Youtube Subscribe