నూతన విద్యుత్, సబ్ స్టేషన్ ని ర్మా ణానికి భూమి పూజ చేస్తున్న, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ,

రూ2.50 కోట్ల విధులతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించడానికి భూమి పూజ,
రుద్రవరం మండలం తిప్పారెడ్డిపల్లె సమీపంలో సుమారు రూ. 2.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పనులకు శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రుద్రవరం మండలం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉందని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్యలతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఓవర్ లోడ్ సమస్య కారణంగా పగటిపూట పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా జరగలేదని గుర్తుచేశారు. ఈ కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల సుమారు 20 వేల మంది వినియోగదారులకు, ముఖ్యంగా రుద్రవరం, ఆలమూరు ప్రాంతాల రైతులకు సాగునీటి సరఫరాలో విద్యుత్ కష్టాలు తీరుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 3 నుండి 4 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి సహకరించిన అధికారులకు, భూమిని అందించిన రైతులకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్, డిఈ శ్రీనివాసులు రెడ్డి, ఏడిఈ శ్రీనివాసులు, ఏఈ రాజశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి, పర్యవేక్షణ అధికారి సుబ్రమణ్యం, మండల టీడీపీ నాయకులు ఎల్వీ రంగయ్య, ఎర్రం ప్రతాప్ రెడ్డి, అల్లాడి శేఖర్, బండారు బాలరాజు, పక్కిరయ్య గౌడ్, పేరూరు రామనాథరెడ్డి, బాచేపల్లి పత్తి నారాయణ, గాంధీ బండల శ్రీనివాసులు, నాగేంద్ర పలువురునాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.,,,

WhatsApp Join Now
Youtube Subscribe