ఘనంగాసావిత్రి బాయిపూలే జయంతి

వంగర మండలంలో దళిత బహుజన జెఏసి సంఘాలు ఆధ్వర్యంలో శనివారం సావిత్రి బాయి పూలేవజయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఉత్తరవెల్లి గణేష్ నాయుడు హాజరై మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా. పనిచేస్తూమహిళలులో విద్యాభివృద్ధికి ఎంతగానో ఆమె కృషి చేశారు.అని ఆయన వివరించారు. ఆమెను స్ఫూర్తిగాతీసుకొని బాలికలు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. దళిత బహుజన జేఏసీ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు. డివిఎంసి. సభ్యుడు. మజ్జి గణపతి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గములో జన్మించిన ఆమె సమాజంలో ప్రతి ఒక్కరు. విద్యావంతులు కావాలని స్త్రీలకు చదువు నేర్పిన మొదటి ఉపాధ్యాయాని అని కొనియాడారు. దళిత బహుజన సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం గణపతిరావు మాట్లాడుతూ భారతదేశ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే మహిళల విద్య కోసం పాఠశాలస్థాపించి. సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలుగా తీర్చిదిద్ది దేశలో మొదటి మహిళా ఉపాధ్యాయులుగా దేశ లోమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా సామాజిక సంస్కర్తగా తయారు చేశారన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళా విద్యా వ్యాప్తికి ప్రతి ఒక్కరు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు. పల్ల మురళి మహిళా స్వయం శక్తిసంఘాల నాయకులు బహుజన సంఘ నాయకులు అప్పన్న. రామారావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe