రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ ధ్యేయం
కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు 50,000 చొప్పున రూ.128.33 కోట్లు రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ
కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు జమ
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు
రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ ధ్యేయం అని, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, టి.జి.భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలు రావడం వల్ల రైతులు తీవ్రమైన పంట నష్టం, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం, వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా రైతుల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం సుమారు రూ.130 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ. 50,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందని, చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే దాదాపు రూ. 130 కోట్లు మంజూరు చేశారన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ అని, రాష్ట్ర అభివృద్ధికి నీటి పారుదల, వ్యవసాయ రంగాలు అత్యంత కీలకమన్నారు.. 2014-2019 కాలంలో వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలకు “స్వర్ణ యుగం”గా మంత్రి అభివర్ణించారు.. ఆ సమయంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే రూ. 50 వేల కోట్ల ఖర్చు చేసి శరవేగంతో ముందుకు తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు..వ్యవసాయ రంగం లో 7-8 % ఉన్న జిడిపి ని 17 శాతం వరకు తీసుకొని వెళ్లి దేశంలోనే వ్యవసాయ రంగం అగ్రగామిగా నిలిచిందన్నారు.. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ రెండు ముఖ్యమైన శాఖలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు…గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఇరిగేషన్ రంగానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ నాలుగు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీరిచ్చే విధంగా ఇరిగేషన్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నారు.. ఎవరూ ఊహించని విధంగా బంపర్ క్రాప్ (అధిక దిగుబడి) వచ్చినందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా తాను చాలా సంతోషిస్తున్నానన్నారు. . కానీ పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మిరప పంటకు ధర పడిపోయిందని, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్’ ఏర్పాటు చేసి, మార్కెట్‌ను స్థిరీకరించి మిర్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమది అని మంత్రి పేర్కొన్నారు.
