అత్యంత పేద కుటుంబాలు…. గ్రామీణ ప్రాంతాలు…. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు…. అనేక సవాళ్లు…. ఆర్థిక కష్టాలు… ఇవీ నేడు కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారి జీవితాలు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి…కూటమి ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో విజయం సాధించి నేడు సగర్వంగా పోలీసు యూనిఫాం ధరిస్తున్న 5,757 మందికి నా అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు. పట్టుదలతో, దీక్షతో పోలీసు ఉద్యోగం కోసం వారు పడిన కష్టం నా గుండెను తాకింది. నేడు పోలీసు శాఖ ఉద్యోగులుగా వేదికపైకి వచ్చి వారు చెప్పిన గాథలు నన్ను కదిలించాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ పూర్తి చేసి వారి కలను నిజం చేసిన ఈ సందర్భం నాకు రెట్టింపు సంతృప్తినిచ్చింది. ఇలాంటి వారి కోసం మరెంతో కష్టపడాలి… నిరంతరం పనిచేయాలి అనే ఒక సంకల్పాన్ని నాకు కలిగించింది. వేల కుటుంబాల్లో చూసిన ఆనందంతో వారి కోసం మరింత ఉత్సాహంతో పని చేస్తానని హామీ ఇస్తున్నాను. ఒక్క ఉద్యోగంతో వారి కుటుంబాలు ఎలా మారుతాయో తెలిసిన నాయకుడిగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మరింత పట్టుదలగా పనిచేస్తానని ప్రకటిస్తున్నాను.
20 లక్షల ఉద్యోగాల కల్పనకు మరింత పట్టుదలగా పనిచేస్తానని ప్రకటిస్తున్నాను.
17
Dec
WhatsApp
Join Now
Youtube
Subscribe
