వినుకొండ నియోజకవర్గంలో 7 దేవాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులకై ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడును కోరారు

వినుకొండ నియోజకవర్గంలో ఏడు దేవాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడును కోరారు.

దీనికి స్పందించిన టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లో దేవాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆలయాల నిర్మాణానికి అవసరమైన పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేశారు.

ఈ సందర్భంగా దేవాలయాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడుకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

WhatsApp Join Now
Youtube Subscribe