విద్యుత్ చార్జీలు తగ్గింపు దేశంలోనే తొలిసారి

అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ శిరీషదేవి

రంపచోడవరం డిసెంబర్ 6 (ఎల్లో సింగం ప్రతినిధి):విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి సుమారు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ :32 వేల కోట్లు భారం ప్రజలపై వేసినట్లు తెలిపారు.ఇలా 1.29 లక్షల కోట్లు రూపాయలు అప్పులు మిగిల్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం యూనిట్ కి 13 పైసలు తగ్గించినట్లు తెలిపారు. జగన్ రెడ్డి హయాంలో అక్వా రైతులకు యూనిట్ కి రూ.:3.50 కి సరఫరా చేస్తే కూటమి ప్రభుత్వం దానిని రూ. 1.50 కి సరఫరా చేస్తుందన్నారు. అలాగే వైకాపా ప్రభుత్వం విద్యుత్ డిస్కమ్ లనుండి యూనిట్ రూ :5.19 కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం యూనిట్ ను కేవలం రూ :4.70 లకు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచిత సోలార్ రూఫ్ టాఫ్ తో సోలార్ విద్యుత్ వినియోగం పై చైతన్యం చేస్తూ ప్రోత్సహం చేస్తున్నదని పేర్కొన్నారు. బీసీ వర్గాలు వారికి కేంద్రం ప్రభుత్వం అమలు చేసే సబ్సిడీ తో పాటు కూటమి ప్రభుత్వం రూ: 20,000/- రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.ఇలా విద్యుత్ వినియోగదారుల పై పడే ట్రూ ఆఫ్ భారాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు కోట్లు రూపాయలు భారాన్ని ప్రజలపై పడకుండా చేసిన ఘనత కూటమి సర్కార్ కే చెల్లిందన్నారు. ఇలా విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు చేసి ప్రజలపై భారాన్ని తగ్గించిన చరిత్ర కూటమిదే అన్నారు. సోలార్, పవన్ విద్యుత్ వినియోగం ఏర్పాటు పై ముందుకు సాగుతున్నారు. ఇలా విద్యుత్ వినియోగం పై గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని ఇలాంటి చరిత్ర దేశంలోనే తొలిసారి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందని ప్రకటన ద్వారా తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe