“కంబాల” ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఘనంగా లక్ష్మి గణపతి హోమం..

రంప చోడవరం డిసెంబర్ 6 (ఎల్లో సింగం ప్రతినిధి):సంకష్టహర చతుర్థి పర్వదినం సందర్భంగా స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారిచే అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాధరావు శర్మ గారు లక్ష్మీ గణపతి హోమాన్ని, మంగళవారం ఘనంగా నిర్వహించారు.ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ, సంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఏటా పాడి పంటలు బాగా పండాలని, అన్నదాతలు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల వారు, ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ప్రతి నెల లోక కళ్యాణార్థం లక్ష్మి గణపతి హోమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కంబాల శ్రీనివాసరావు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు._

WhatsApp Join Now
Youtube Subscribe