దువ్వాడ మాధురి శ్రీనివాస్‌కు పెద్ద షాక్ తగిలింది. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జేబీఐఈటీ (JBIET) ఎదురుగా ఉన్న ‘ది పెండెంట్ ఫామ్‌హౌస్’లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం.
అయితే, అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు వేడుకను అడ్డుకున్నారు. పోలీసుల అనుమతి తీసుకోకపోవడంతో పార్టీని భగ్నం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, అక్కడ అక్రమ మద్యం ఉన్నట్లు గుర్తించి ఎస్ఓటీ అధికారులు చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ దాడిలో 10 స్కాచ్ బాటిళ్లు, 5 హుక్కా సెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
దీనిపై దువ్వాడ మాధురి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిసింది
WhatsApp
Join Now
Youtube
Subscribe
