నిత్యం ప్రజాసేవలో ముందుండాలి

సమిష్టిగా ముందుకు సాగుదాం

కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా

పార్టీశ్రేణులు ఐక్యంగా ఉండాలి

అరకు పార్లమెంట్ తెదేపా అధ్యక్షురాలు ఎమ్.తేజోవతి

ఎమ్మెల్యే, రాష్ట్రఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని నమ్ముకున్న వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెదేపా అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు ఎమ్. తేజోవతి అన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో శనివారం పార్టీ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస యాదవ్ సౌజన్యంలో తెదేపా నియోజకవర్గ స్థాయి నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా పోలవరం జిల్లాలో అడుగు పెట్టిన ఎమ్.తేజోవతిని ఎమ్మెల్యే శిరీషదేవి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవి నామినేటెడ్ సభ్యులు,మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను పరిచయం చేశారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్ర పటానికి పాలభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు పని చేస్తానని పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లటంలో పార్టీ శ్రేణులు సంయుక్తంగా పని చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన హామీలు అన్నీ అమలు చేశామన్నారు.. పరిపాలన సౌలభ్యం రీత్యా పోలవరం జిల్లా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే అన్నారు. ప్రతీ నెలా రెండో శనివారం, ఆదివారం మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎలాంటి సమస్య లు ఉన్నా స్థానికంగా పరిస్కారం కాకపోతే తన దృష్టిలో పెట్టాలని సూచించారు. తన వంతుగా పరిస్కార చర్యలు చేపడతా నని పేర్కొన్నారు. మరికొందరు వక్తలు మాట్లాడుతూ పార్టీ విధి విధానాలపై క్షుణ్ణంగా వివరించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబురమేష్, APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభాని, AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు, మండలపార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, జె. వెంకటరమణ, పల్లాల వెంకటరెడ్డి, పొత్తూరు కాంతారెడ్డి, గురుకు శేషు. కుమార్, గోళ్ళ చంటిబాబు, జమాల్ ఖాన్, బొర్రా నరేష్, బొల్లా పుల్లయ్య, యడవల్లి భాస్కర్, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, కుంజం బాపన్నదొర, కె. పోశమ్మ, రత్నకుమారి, లోవమ్మ, రాంబాబు, మల్లేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు పాము అర్జున్, మాగపు బాబురావు, సీనియర్ నాయకులు దంతులూరి శివాజీ రాజు, గణజాల తాతారావు, రైతు విభాగం నాయకులు కనిగిరి రాంబాబు, మువ్వా శ్రీను, మధు, బాపిరాజు, మాజీ ఎంపీపీ తీగలప్రభ, బుల్లియమ్మ, నిరంజనీ దేవి, చోటు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe