ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్

రాజు (ప్రభాస్) జీవితంలో ఓ ముఖ్యమైన మలుపు తిరుగుతుంది. కొన్నేళ్ల క్రితం ఆచూకీ లేకుండా పోయిన తన తాత కనకరాజు (సంజయ్ దత్) జాడ కోసం హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చేరుకుంటాడు. తాతను ఎప్పుడూ చూడని రాజు… అల్జైమర్స్ చివరి దశలో ఉన్న తన నానమ్మకి గుర్తుండే ఒక్క వ్యక్తి ఆయనే కావడంతో, ఆమె కోరిక నెరవేర్చాలనే తపనతో ఆ వెతుకులాట మొదలుపెడతాడు.

ఈ ప్రయాణంలోనే రాజు జీవితంలోకి బ్లెస్సీ (నిధి అగర్వాల్) అడుగుపెడుతుంది — తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది. అదే సమయంలో నిద్రమత్తులో కనిపించే భైరవి (మాళవిక మోహనన్) కూడా అతని మనసును కుదిపేస్తుంది.

తాత జాడ వెతుక్కుంటూ చివరికి నర్సాపూర్‌లో ఉన్న ఒక రహస్యమైన మహల్‌కు చేరుకుంటాడు రాజు. ఒకసారి అడుగుపెడితే బయటకు రావడం అసాధ్యం అనే ఆ మహల్‌లో రాజు మరియు అతని స్నేహితులు ఎదుర్కొన్న భయానక అనుభవాలేమిటి? కనకరాజు ఎందుకు ఆ మహల్‌లో ఆత్మలా సంచరిస్తున్నాడు? నానమ్మ చివరి కోరికను రాజు నెరవేర్చగలిగాడా? ఆ ప్రయత్నంలో అతను ఎంతటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు?

ఈ అన్ని ప్రశ్నలకు సమాధానమే ‘రాజా సాబ్’ సినిమా.

ఫోకస్ పాయింట్: మిక్స్డ్ జోనర్ సినిమాలో మైండ్ గేమ్ వర్కవుట్ అవ్వలేదు మారుతి సాబ్!

రేటింగ్: 2.5/5

WhatsApp Join Now
Youtube Subscribe