కారుకొండ రామవరం యు ఎఫ్ డబ్ల్యు సి ను సందర్శించిన డి ఎం హెచ్ ఓ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం

కొత్తగూడెం.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ జిల్లా కేంద్రంలోని కారుకొండ రామవరం యు ఎఫ్ డబ్ల్యు సి కొత్తగూడెంను సందర్శించడం జరిగినది. జిల్లాలో ప్రతి శుక్రవారం జరిగే ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమమును ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది . ప్రజలతో ఆయా గ్రామాలలో వారి ఇంటి చుట్టూపరిసరాలను శుభ్రంగా ఉంచేటట్లు వారికి అవగాహన ఇవ్వాలని తెలియజేశారు. రికార్డులను పరిశీలించారు అదేవిధంగా యు ఎఫ్ డబ్ల్యు సి కొత్తగూడెం ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే గదిని పరిశీలించి, మందులను సరైన ఉష్ణోగ్రత ను మెయింటెన్ చేయాలని, ఒకసారి ఓపెన్ చేసిన వయల్ మీద తేదీ సమయం తప్పకుండా రాసి కంటైనర్లు నిల్వ చేయాలని సూచించారు. రికార్డులను సక్రమంగా రాసి భద్రంగా భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మోహన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe