ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా సేవలు అభినందనీయం

  • ఎస్సీఆర్డబ్ల్యుఏ సేవలు ప్రశంసనీయం
  • మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (విశాఖపట్నం,జనవరి 3): సమాజానికి సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శనివారం
    గంటా ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ రూపొందించిన డైరీ – 2026 ను గంటా శ్రీనివాసరావుకు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా సేవలు అభినందనీయమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
    అలాగే స్మార్ట్ సిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజల వరకు చేరేలా మీడియా వర్గాలు మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విషయంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. పదేళ్ల క్రితం 30 మందితో మొదలైన నేటికి భీమిలి నుండి అనకాపల్లి వరకు ఈ అసోసియేషన్ 500 మంది జర్నలిస్టులకు వెల్ఫేర్ అందించడం శుభపరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి,కోశాధికారి కర్రి సత్యనారాయణ (సత్య) తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe