పత్తికొండ MLA కే.ఈ. శ్యామ్ కుమార్ అన్న గారి చేతుల మీదుగా CMRF చెక్కుల పంపిణీ

పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కే.ఈ. శ్యామ్ కుమార్ అన్న గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను 53 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ. 30,04,200/- (ముప్పై లక్షల నాలుగు వేల రెండు వందల రూపాయలు) విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ అన్న గారు మాట్లాడుతూ, అనారోగ్యాలు, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు CMRF ఒక భరోసాగా నిలుస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
MLA క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సహాయం పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe