ఇటీవల టీడీపీపీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచనతో వెంటనే కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎంపీ.
ఏడాది పొడవునా నిరంతరాయంగా కొనసాగనున్న మన ఊరు మన ఎంపీ కార్యక్రమం.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే మంచి ప్రయత్నం.
ఏలూరు జిల్లా ఎల్లో సింగర్ స్టాఫ్ రిపోర్టర్
ఏలూరు పార్లమెంటు పరిధిలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడే విధంగా మంగళవారం నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఈమేరకు మీడియాకి ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 27న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఎంపీలు కూడా గ్రామాలలో పర్యటించాలని సూచించారని చెప్పిన ఎంపీ, ముఖ్యమంత్రి సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో ప్రతి నెల కొన్ని రోజులు ఏలూరు పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలు, గ్రామాలు పర్యటించే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ఈ కార్యక్రమానికి మన పల్లెకు మన ఎంపీ అనే పేరు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా మంగళవారం ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి భేటీ కానున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటనలో తెలియచేశారు.
