“విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయి. విద్యుత్ రంగంతోపాటు… వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయి. దావోస్ సదస్సుకు వెళ్లాం ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగాం… విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగాం. ఏపీకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది… ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలి.”అని సీఎం సూచించారు.
ప్రజలపై భారాన్ని తగ్గించగలిగాం, సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు
07
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
