భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబినాయన

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. అందులో భాగంగా శుక్రవారం కారాడ గ్రామ రైతులకు ఈ భూ హక్కు పత్రాలను ఎమ్మెల్యే బేబినాయన అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ కారాడ గ్రామా నికి సంబంధించి 2700 ఎకరాలు సర్వేచేసి, ఎటువంటి వివాదాలు,ఇబ్బందులు లేని భూమిలకు సంబంధించి 821 పాసు పుస్త కాలను సంబంధిత రైతులకు అధికారులు అందజేయనున్నట్లు తెలిపారు.గత ప్రభు త్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎ స్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఇచ్చిన పాసు పుస్తకాలలా కాకుండా, ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తుందని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యల ను పరిష్కరించి,ఈ కొత్త పాసు పుస్తకాలను అందిస్తుందని అన్నారు.వ్యవసాయం అంటే తనకు ఎంత ఇష్టమో ప్రజలందరికీ తెలుస ని, ఎంతో గొప్ప రైతాంగం ఉన్న కారాడ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం తనకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బేబి నాయన అన్నారు.భారీ వాహనాల రాకపో కలు వలన కారాడ రోడ్డు పాడయ్యి, కారాడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తా ను ఎమ్మెల్యే గా ఉండడం ఆ సమస్యలను పరిష్కరించడం తనకు సంతోషం కలిగించిం దని అన్నారు.త్వరలోనే ఇంకా పూర్తికావల సిన పనులను చేపడతామని ఎమ్మెల్యే బేబి నాయన అన్నారు,అందరం కలిసికట్టుగా ప నిచేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చే సుకోవాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఆర్డీవో జెవి ఎస్ ఎస్ రామ్మోహన్,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వ హణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, బొ బ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ,బొబ్బిలి మండలం బీజేపీ అధ్యక్షుడు తాడ్డి ఈశ్వరరావు,కారాడ గ్రామ సర్పంచ్ ప్రతినిధి చొక్కాపు సంజీవ్ నాయు డు, కారాడ పీఏసీ ఎస్ చైర్మన్ పొట్నూరు జనార్దన్,ఎంపీటీసీ డోకల తిరుపతి నాయు డు, తహశీల్దార్ శ్రీ ఎం.శ్రీను గారు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Youtube Subscribe