బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో ఈరోజు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పాసుపుస్తకాలపై ముద్రించిన ఫోటోలను తొలగించి, పవిత్రమైన ప్రభుత్వ రాజముద్రతో ఈ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆస్తి హక్కులకు భద్రత కల్పించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే శ్రీ నక్క ఆనంద్ బాబు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ గారు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
