48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగ్యూ కేసులు రాగా….ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,452 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు డెంగ్యూ కేసులు 56 శాతం తగ్గాయని తెలిపారు. గత ఏడాది 7,871 మంది మలేరియా బారినపడగా…..ఈ ఏడాది 7,010కి మలేరియా సోకిందన్నారు. మలేరియా కేసుల్లో 11 శాతం తగ్గుదల కనిపించదని వివరించారు. చికున్ గున్యా గత ఏడాది 266 కేసులు రాగా…ఈ ఏడాది 142 వచ్చాయని, చికున్ గున్యా కేసులు 46.5 శాతం తగ్గినట్లు అధికారులు వివరించారు. జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE) కేసులు 11 నుంచి 2కు తగ్గినట్లు తెలిపారు. పరిశుభ్రత పెంపు, సీజనల్ వ్యాధులపై నిరంతర ప్రచారం, విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, ముందు జాగ్రత్తలు కారణంగా సీజనల్ వ్యాధులు 48 శాతం మేరకు తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

WhatsApp Join Now
Youtube Subscribe