ప్రకాశం జిల్లా :కందుకూరు 05-01-2026
జనగణన పూర్తయిన తర్వాత 2027లో మున్సిపాల్టీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .జూన్ నాటికి 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేసారు .
ప్రకాశం జిల్లా కందుకూరులో సోమవారం మంత్రి నారాయణ అకస్మిక పర్యటన చేసారు .ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ది పనులను పరిశీలించారు .టిడ్కో కాలనీ,MIG లేఅవుట్,డివైడర్లు,సెంట్రల్ లైటింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు .
అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు .
MIG లేఅవుట్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు .జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిందన్నారు .
ఐదేళ్లలో 50 వేల ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు .వచ్చేజూన్ నాటికి 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు .టిడ్కో కాలనీకి ఇళ్లు,కొళాయి కనెక్షన్లు వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు .
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కందుకూరు అభివృద్దికి ప్రకటించిన 50 కోట్లలో ఇప్పటికే 20 కోట్లు విడుదల చేసామని చెప్పారు .
మరో 30 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ,స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు .
