ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
కోవెలకుంట్ల, జనవరి, 5,
( ఎల్లో సింగం ప్రతినిధి )
దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు నమ్ముకున్న ఉపాధి హామీ చట్టాన్ని రాజకీయం పేరుతో పేరు మార్పులు అందులో ఉన్న నిబంధనలు మార్చడం పూర్తి అన్యాయమని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కోవెలకుంట్ల పట్టణంలో జరిగిన గ్రామసభలో నూతన చట్టాన్ని వ్యతిరేకించడం జరిగింది. అనంతరం గ్రామసభ నిర్వాహకులు ఈవో ప్రకాష్ నాయుడు గారికి ఏపీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ దేశం కోసం బ్రిటిష్ వారితో అహింస మార్గంలో పోరాటం చేసిన వ్యక్తి మహానుభావుడు గాంధీ మహాత్ముడు ఆయన పేరు మీద ఉన్న పథకాన్ని రూపుమాపడం చాలా అన్యాయమని దీనిని యధావిధిగా కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన డిమాండ్ చేశారు. కొత్త చట్టం వల్ల 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు కేటాయించడం పట్ల కూలీలకు ఉపాధిని దూరం చేయడం తప్ప వేరే ఏం లేదని ఈ గ్రామ సభ ద్వారా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఉపాధి కూలీలు చేసే పని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఉపయోగపడే విధంగా పంట కాలువలు, భూగర్భ జలాలు మరియు వ్యవసాయ ఉత్పత్తి కోసం ఈ చట్టం అమలు అవుతుంది తప్ప వేరే దానికి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించారు. ఉపాధి పనుల వలన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం అభివృద్ధి లేని ప్రాంతాల్లో వలసలు నివారించడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతున్న తరుణంలో దీనీని నిర్వీర్యం చేయడానికి పడుతున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం కూలీలకు అండగా ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాములమ్మ, బాలస్వామి, నరసింహులు, కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
