రోటరీ ఆధ్వర్యంలో రెండు లక్షలు విలువగల పరుపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబినాయన
అత్యున్నత సేవల ద్వారానే రోటరీ సంస్థ ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొంది నదని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రోటరీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుం దని స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన అన్నా రు. శనివారం స్థానిక సింహాలతోటలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో రోటరీ పూర్వ అధ్యక్షులు శ్రీనివాసన్,కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వసతి గృహం లో చదువుతున్న బాలికలకు పరుపులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మా ట్లాడుతూ బొబ్బిలి రోటరీక్లబ్ ఆధ్వర్యంలో రూ.2లక్షలు విలువచేసే 100 పరుపులను పంపిణీ చేయటం అభినందనీయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. రోటరీ వార్షిక గ్రాంట్ లక్ష ఏభై వేలుకు బొబ్బిలి రోటరీ మరో లక్ష ఏభై వేలు కలిపి 3 లక్షల రూపాయలతో 150 పరుపులు వసతి గృహ బాలికలకు పంపిణీ చేయటం రోటరీ సేవా కార్యక్రమాలు అద్దంపడుతుందని అన్నారు. అనంతరం రోటరీ జిల్లా అధ్యక్షులు జె సి రా జు మాట్లాడుతూ రోటరీ ద్వారా బొబ్బిలి పట్టణ, పరిసర ప్రాంతాలు మహిళలకు 100 కుట్టు మిషన్లు ,చదువుకొనే బాలికల కు 50 సైకిళ్లు, గ్రంధాలయాలకు పుస్తకాలు, బొబ్బిలి పార్క్ వద్ద రోటరీ బస్ షెల్టర్ ను కోటి చెరువు గట్టుమీద సోలార్ లైట్లు, సిమెంట్ బెంచీలను ఇలా ఎన్నో సేవా కార్య క్రమాలు రోటరీ ద్వారా నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగానే రెండు లక్షల రూపాయల తో వసతి గృహంలో చదువుతున్న గిరిజన బాలికలకు పరుపులను బొబ్బిలి రోటరీ సమకూర్చిందన్నారు.ప్రత్యేక అధితిగా విచ్చే సిన బొబ్బిలి ఎస్టీవో పద్మనాభం మాట్లాడు తూ పాఠశాలకు రహదారి,వీధిదీపాలు సమకూర్చుటకు కృషి చేస్తానని అందుకు రోటరీ సహకారం అందించాలన్నారు. అనం తరం ఎమ్మెల్యే బేబినాయన గెంబలి శ్రీనివా సరావు,బంగార్రాజు, అల్లాడ భాస్కర రావు చేతుల మీదుగా పాఠశాల హెచ్ ఎమ్ జ్యోతి కుమారి ,బాలికలకు పరుపులను అందించారు.పాఠశాల హెచ్ ఎమ్ జ్యోతి కుమారి రోటరీ కి కృతజ్ఞతలు తెలియజేశా రు. పాఠశాల బాలికలు అద్భుతంగా వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రోటరీ సభ్యు లు, పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యే బేబినాయ న ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్ర మంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు వారణాసి శ్రీ హరి,కార్యదర్శి శివ కాంత్,సింద్రీ శ్రీనివాసన్, యూత్ చైర్ డేవిడ్ జె విక్టర్,ప్రవీణ్ కుమార్, జయప్రకాష్, పాఠశాల,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు…
