▪️నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభం
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ముందస్తు బుకింగ్ నేటి (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని ద.మ. రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ వెల్లడించారు. వీటిలో ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి గమ్యస్థానాలుగా నడవనున్నాయి.
WhatsApp
Join Now
Youtube
Subscribe
