పల్నాడు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం సొంత ఖర్చులతో వినుకొండ ప్రాంత రైతులను అధ్యయన పర్యటనలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. అలాగే నారాకోడూరు, చీరాల ప్రాంతాలకు చెందిన 200 మంది రైతులను కూడా ఈ పర్యటనలకు పంపుతున్నట్లు చెప్పారు.
అదే సమయంలో వైసీపీ పాలనలో జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి మళ్లీ చెలరేగిందని ఆయన ఆరోపించారు. ప్రజల శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, రైతులు మరియు ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
