యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధికి కృషిమంత్రి బీసీ జనార్ధన రెడ్డి

ఆలయచైర్మన్ గా బండి మౌళీశ్వర రెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం

నంద్యాల జిల్లాలో బనగానపల్లె మండలంలోని ఎర్రమల పర్వత స్థానంలో పర్వత సానువుల్లో ఏకశిలపై విగ్రహరూపాన ఆ ఆదిదంపతులు పూజలు అందుకుంటున్న ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం క్షేత్ర ప్రాంగణంలో ఆలయ చైర్మన్ గా బండి మౌళీశ్వర రెడ్డి పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆలయ ఈవో పాండురంగారెడ్డి నూతన చైర్మన్ గా ఎన్నికైన బండి మౌళీశ్వర రెడ్డి, పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం గావించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి బీసీ జనార్దన రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీ ఆలయం ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా
యాగంటి క్షేత్రానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరిగిందని ఆ రద్దీనిబట్టి అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు.
దేవస్థానం వచ్చే భక్తులకు సరైన వసతి సదుపాయాలు, పార్కింగ్, సీసీ రోడ్లు ఏర్పాటు ఉందని ఆ దిశగా కృషి చేస్తామన్నారు. ఆలయానికి వచ్చే ఆర్థిక రాబడి ఆలయానికి ఖర్చు చేయాలనే ఉద్దేశ్యంతో ఆలయ ఈవోను నియామకం చేశామని అందుకు తగ్గట్లుగా రాబడి ప్రస్తుతం రూ.3 కోట్లకు పెరిగిందన్నారు. పాలక మండలి క్షేత్ర అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయంపట్ల తన వంతు సహకారం సంపూర్ణంగా ఉంటుందని అన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe