మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

తెలుగుదేశం పార్టీ ఆలూరు ఇన్చార్జి వైకుంఠం జ్యోతి సహకారంతో మహిళలకు 50% సబ్సిడీతో కుట్టు మిషన్లను టీడీపీ కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుబాన్,మండల ప్రధాన కార్యదర్శి గోవిందు గౌడ్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్యనిర్వహక కార్యదర్శి ఆదం,మండల కార్యదర్శి హుసేన్ పీరా,సీనియర్ నాయకులు డి ఎస్ బాషా,,మండల మైనార్టీ అధ్యక్షులు మోయిన్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్,జనసేన కన్వీనర్ అశోక్, కో కన్వీనర్ వరాల వీరేష్,46 బూత్ కన్వీనర్ టి పి సాయిబేష్ తదితరులు మండల కేంద్రంలో స్థానిక రాజా నగర్ కాలనీలో మహిళలకు 30 కుట్టు మిషన్లను 50% సబ్సిడీపై అందించారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ కూటమిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు, ప్రజా సంక్షేమంతో దూసుకెళ్తుందని తెలిపారు.ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సహకారంతో సబ్సిడీపై మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని వారు తెలిపారు. కుట్టు మిషన్ లబ్ధిదారులు అయినా మహిళలు మాట్లాడుతూ బయట మార్కెట్లో 14 వేల ధర ఉన్న కుట్టు మిషన్ ను 50% సబ్సిడీతో 7000 రూపాయలకు అందించడం సంతోషదాయకమని,టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు బాగోడి రాము,గిరి,మల్లి,రారావి సిద్దు,బూత్ కన్వీనర్లు తాహెర్,వలి బాషా, శాలి అమాన్,కూటమి నాయకులు కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe