బెల్లంపల్లి జిల్లా సాధనకు ప్రజల పోరాటం – జిల్లా పునర్విభజనపై సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు

బెల్లంపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో సాగిన ప్రజా ఉద్యమానికి జిల్లా పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం శ్రీ రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై బెల్లంపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆదిలాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించారని విమర్శలు చేస్తూ, బెల్లంపల్లి జిల్లా కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో దీర్ఘకాల పోరాటం సాగింది. బెల్లంపల్లి తొలి ఎమ్మెల్యే, సీపీఐ నేత కామ్రేడ్ గుండా మల్లేష్ అధ్యక్షతన, మాజీ ఎమ్మెల్యేలు డా. పాటి సుభద్ర, శ్రీదేవి మేడం నాయకత్వంలో జిల్లా సాధన కమిటీ ఏర్పాటుైంది. వర్తక–వాణిజ్య సంఘాల సహకారంతో 15 రోజుల దీక్షలు, ధర్నాలు, బెల్లంపల్లి బంద్ నిర్వహించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు సీపీఐ, బీజేపీ, సీపీఎం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. నేడు సీఎం రేవంత్‌రెడ్డి బెల్లంపల్లికి ఘన చరిత్ర ఉందని, జిల్లా కావాల్సిన అవసరం ఉందని పేర్కొనడం ఉద్యమానికి బలాన్నిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, వ్యాపార వర్గాలు ఏకంై బెల్లంపల్లి జిల్లా సాధనకు ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Youtube Subscribe