ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం

నిడదవోలులో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ – మంత్రి కందుల దుర్గేష్

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు రూరల్ మండలాల్లో ఇంటింటికీ వెళ్లి ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్లు స్వయంగా పంపిణీ చేశారు.

నూతన సంవత్సరం సందర్భంగా లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా డిసెంబర్ 31న ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి, పారదర్శకంగా నేరుగా ఇంటివద్దకే అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయని, దేశంలోనే పెన్షన్ల కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులే కూటమి ప్రభుత్వానికి అసలైన బహుమానం అని మంత్రి దుర్గేష్ అన్నారు.

మంత్రి ఆత్మీయంగా పలకరించడంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe