కుప్పం రూరల్ మండలం ఉర్లఓబనపల్లె గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను ఉడా చైర్మన్ డా. బి.ఆర్. సురేష్ బాబు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా. సురేష్ బాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, రైతులకు నిజమైన న్యాయం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజల డబ్బుతో స్వప్రచారం చేయడం కాదు, రైతుల హక్కులకు గౌరవం కల్పించడమే ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.ప్రజల ఆస్తులపై వ్యక్తిగత ఫోటోలు కాకుండా, రాజముద్రతో కూడిన అధికారిక గుర్తింపు ఉండాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతుల ఆనందం, భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ,కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వ రాజు , మాజీ ఎంపీపీ వెంకటేష్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంధ్ర శేఖర్ 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ , ఎమ్మార్వో చిట్టి బాబు ,రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల ఆస్తులపై వ్యక్తిగత ఫోటోలు కాదు – రాజముద్రతో గౌరవంగా వుండాలి:పియంకే ఉడా చైర్మన్ డా. బి.ఆర్. సురేష్ బాబు
03
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
