పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిర్రీ

పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సదస్సులో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతుల పాసుపుస్తకాల్లో రాజకీయ ప్రచారాన్ని ప్రవేశపెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటువంటి విధానాలకు స్వస్తి పలికి, రాజముద్రతో అధికారికంగా ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సొసైటీ ప్రెసిడెంట్ సరిపల్లి సత్యనారాయణ రాజుఎంపీటీసీ నాలి శ్రీనివాస్, సర్పంచ్ బుద్దా జగ్గారావు, జనసేన అధ్యక్షులు సంకుల రామకృష్ణ, తహసిల్దార్ ఉదయ్ కుమార్, వీఆర్వో జగదీశ్వరి, పంచాయతీ అధికారులు, కూటమి నాయకులు గూడెల్లి లక్ష్మీనారాయణ, సాంబ, తోట బాలు, కోలా మధు, బండారు అనిల్, సిరిబత్తుల మధు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe