పాలకొండ నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ బృందం పర్యటన

పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఆదివారం పాలకొండ పట్టణంలో పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో అన్నపూర్ణ ట్రస్ట్‌లో అనాధ పిల్లలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని స్వీట్లు పంచిపెట్టారు.అనంతరం సీతంపేట మండలం ఆడలి గ్రామంలో బస చేసి గిరిజనుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ నాయుడు వై. వినోద్ రాజు శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు భానోజీ నాయుడు చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe