పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు పార్వతీపురం పట్టణం బెలగాం గెడ్డవీధి సమీపంలో చౌక ధరల దుకాణంలో గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రారంభించారు. అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మాట్లాడారు చౌక ధరల దుకాణంలో ఏ ఏ సరుకులు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పండగ రోజుల్లో పేదలకు అవసరమైన నిత్యవసరాలను ప్రభుత్వం తక్కువ ధరకు అందించి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఎమ్మెల్యే బోనెల వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సరుకులను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం….ఎమ్మెల్యే విజయ్ చంద్ర
02
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
