పంట కాలువలకు భారీగా నిధులు విడుదల

తూటి కాడ, గుర్రపుడెక్క తొలగింపు పనులకు రూ.రెండు కోట్ల 25లక్షలు మంజూరు

రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు ధన్యవాదములు : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ :
నియోజకవర్గంలోని పంట కాలువల్లో తూటి కాడ, గుర్రపుడెక్క తొలగింపు పనులకు రూ.2,25,09,000 మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆపరేషన్ అండ్ మైంటెనెన్సు పనుల్లో భాగంగా విడుదల అయిన నిధుల వివరాలు సోమవారం ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
ప్రాజెక్టు కమిటీ పరిధిలోని కేఈబీ కెనాల్ పరిధిలో ఆరు పనులకు రూ.26,85,000లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల పరిధిలో పది పనులకు రూ.49,34,000లు విడుదల అయినట్లు తెలిపారు. ఈ నిధులతో పీసీ, డీసీల పరిధిలోని ప్రధాన పంట కాలువలు కేఈబీ కెనాల్, దివి మెయిన్ కెనాల్, పెద్ద యాదర ఛానల్, కోడూరు ఈస్ట్ ఛానల్ డైరెక్ట్, నాగాయలంక సౌత్ ఛానల్ డైరెక్ట్ ప్రధాన పంట కాలువల్లో తూటి కాడ, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేయనున్నట్లు తెలిపారు.

సాగు నీటి సంఘాల పరిధిలో 33పనులకు రూ.1,48,90,000లు మంజూరు అయినట్లు వివరించారు. శ్రీకాకుళం టీసీ పరిధిలో పనులకు రూ.2.23 లక్షలు, ఘంటసాల టీసీ పరిధిలో పనులకు రూ.4.20 లక్షలు, పాపవినాశనం టీసీ పరిధిలో పనులకు రూ.2.80 లక్షలు, చిట్టూర్పు టీసీ పరిధిలో పనులకు రూ.4.70లక్షలు, వక్కలగడ్డ టీసీ పరిధిలో పనులకు రూ.3.80 లక్షలు, లక్ష్మీపురం టీసీ పరిధిలో పనులకు రూ.4.10 లక్షలు, కే.కొత్తపాలెం టీసీ పరిధిలో పనులకు రూ.మూడు లక్షలు, మంగళాపురం టీసీ పరిధిలో పనులకు రూ.5.38 లక్షలు, మోపిదేవి టీసీ పరిధిలో పనులకు రూ.6.80 లక్షలు, పెద్దకళ్లేపల్లి టీసీ పరిధిలో పనులకు రూ.4.90 లక్షలు, ఉత్తర చిరువోలులంక టీసీ పరిధిలో పనులకు రూ.2.70 లక్షలు, మోదుమూడి టీసీ పరిధిలో పనులకు రూ.5.70 లక్షలు, వీ.కొత్తపాలెం టీసీ పరిధిలో పనులకు రూ.5.20 లక్షలు, విశ్వనాధపల్లి టీసీ పరిధిలో పనులకు రూ.7.10 లక్షలు, సాలెంపాలెం టీసీ పరిధిలో పనులకు రూ.6.50 లక్షలు, కోడూరు టీసీ పరిధిలో పనులకు రూ.5.20 లక్షలు విడుదల అయినట్లు వివరించారు. నీటి సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ పనులను నెలాఖరులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆయా పనులు సక్రమంగా జరిగేలా రైతులు కూడా శ్రద్ధ చూపాలని కోరారు. ఈ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. నీటి సంఘాల వారు వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సూచించారు

WhatsApp Join Now
Youtube Subscribe