నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల భేటీ

ఢిల్లీ నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్ రూపకల్పనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల నుంచి సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. ఈ ‘ప్రీ–బడ్జెట్’ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర పథకాల అమలు, ఆర్థిక సవాళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమతుల్యమైన బడ్జెట్ రూపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ భేటీ నిర్వహిస్తోంది.

WhatsApp Join Now
Youtube Subscribe