దోపిడికి గురవుతున్న గోదావరి మత్య సంపద

** గండి పోచమ్మ సాక్షిగా కోట్లాది రూపాయల మత్స్య సంపదను కొల్లగొడుతున్న ఆక్రమార్కులు
**44 గ్రామాల స్థానిక మత్స్యకారులు, గిరిజన మత్స్యకారుల పోట్ట కొడుతున్న కొవ్వూరు కీ చెందిన దుర్గారావు,సాయి
***చట్టాలు అమల్లో అధికారుల నిర్లక్ష్యం
**స్థానిక మత్స్యకారులు గిరిజన మత్స్యకారులు మత్స్య సంపదను కాపాడుకోవాలి
**స్థానిక ఎమ్మెల్యే భర్తకు రెండు లక్షలు ఇచ్చమంటున్న కొవ్వూరు కి చెందిన దుర్గారావు
** పట్టించుకోని ఫారెస్ట్,ఫిషర్, మరియు పోలీస్ శాఖ

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గం దేవీపట్నం మండలం పి గొందూరు పంచాయతీలో గల గండి పోచమ్మ ఆలయం వద్ద అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిందని దీనికీ అధికారులు స్థానిక నాయకుల అండదండలు మెండుగా ఉన్నాయని స్థానిక మత్స్యకారులు గిరిజన మత్స్యకారులు పొట్ట కొడుతు లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారని అర్ధరాత్రి వలలు వేస్తూ వచ్చిన టన్నులకొద్దీ చేపలను సీడు మరియు ఫీడుని లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్న అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ నుండి నేషనల్ పార్క్ పరిధిలో ఉన్నందున సంబంధిత శాఖ వారు గతంలో ఫారెస్ట్ పోలీస్ మత్స్యశాఖ మూడు డిపార్ట్మెంట్ లతో సంయుక్తంగా దాడి చేసి పలు బోట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ 44 గ్రామాల మత్స్యకారులు వేటాడి జీవించే గోదావరి పరివాహక ప్రాంతంలో మైదాన ప్రాంతమైన కొవ్వూరు మరియు రాజమహేంద్రవరం నుంచి వచ్చిన దుర్గారావు సాయి అనే వ్యక్తులు అంతర్ రాష్ట్రాల నుండి మనుషులను తీసుకువచ్చి మత్స్యశాఖ వారి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న కన్నుల వాళ్ళతో( చీర మేను అలివి) వేట ఆడుతున్న పట్టించుకోకుండా మత్స్యశాఖ నిద్ర మత్తులో వ్యవహరిస్తుంది. అయితే ఈ మైదాన ప్రాంతాల మత్స్యకారులు మరియు అంతర్రాష్ట్ర ముఠాలతో చేతులు కలిపి కొంతమంది స్థానికుల అధికార పార్టీ నాయకులు అండదండలతో ఈ వేటను కొనసాగిస్తూ గోదావరి పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటూ అర్ధరాత్రి సమయంలో (సిరమీను అలివి వల)వేసి టన్నుల కొద్ది చేపలను పట్టి బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా సీడు-ఫిడు గోదావరి గట్లపై పారవేస్తూ నదిలో మత్స్య సంపదను ధ్వంసం చేస్తున్నారు.ఇలా అయితే రాబోయే రోజుల్లో ఎటువంటి సీడు గాని ఫీడు గాని లేకుండా గోదావరి నది ధ్వంసం అవుతుందని కొంతమంది వాదించిన పట్టించుకోని పరిస్థితి. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే భర్తకు డబ్బులు ఇచ్చేమంటూ మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని లేనిపోని మాటలతో కోట్ల రూపాయల్లో ఈ వ్యాపారం జరుగుతుందని దీనిలో కొంతమంది దేవీపట్నం మండలానికి సంబంధించిన అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా మత్స్య శాఖ వారు విధించిన నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న కన్నులవల (సిరమేను అలివి) ఉపయోగించి మత్స్య సంపదను నాశనం చేస్తున్న రాష్ట్ర మత్స్యశాఖ నియమ నిబంధన ప్రకారం చర్యలు తీసుకొని పోలవరం నిర్వహితా 44 గ్రామాల మత్స్యకారులకు గోదావరి చేపలు పట్టుకొనుటకు లైసెన్సులు కలిగి ఉన్నారని కనుక వారికి న్యాయం చేయాలని పలువురు మత్స్య కారులు,గిరిజనులు కోరుతున్నారు. దీనిపై సంబంధిత శాఖల పై అధికారులకు మెమోరాండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe