ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
పోలవరం కే.ఆర్.పురం ఐటిడిఏ కార్యాలయంలో ఆదివారం ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్యంగా హాజరై జైపాల్ సింగ్ ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి కి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హృదయపూర్వక స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం జైపాల్ సింగ్ ముండా జీవితం, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, జైపాల్ సింగ్ ముండా గిరిజన సమాజానికి ఆత్మగౌరవాన్ని, హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో గిరిజనుల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేసిన గొప్ప నాయకుడిగా ఆయనను గుర్తుచేశారు. గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ముఖ్యంగా విద్య, ఉపాధి, ఆరోగ్యం, నివాసం వంటి రంగాల్లో గిరిజనులకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వివరించారు.అలాగే పోలవరం నియోజకవర్గంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి రహదారులు, త్రాగునీటి సౌకర్యాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఐటిడిఏ ద్వారా అమలు అవుతున్న పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా అధికారులు బాధ్యతతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి మాట్లాడుతూ, జైపాల్ సింగ్ ముండా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని అన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్,జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, ఎస్టీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి కాకి లక్ష్మి, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ,మండల ప్రెసిడెంట్ మెట్ట బుచ్చిరాజు,తీగల గోపాలకృష్ణ,ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ రాముల నాయక్, జిసిసి డైరెక్టర్ కన్నపరాజు, ప్రొఫెసర్ కుంజా నాగేశ్వరరావు, జేఏసీ సలహాదారులు జలగం రాంబాబు, సరియం నాగేశ్వరరావు, గంగరాజు,కాకి మధు, మడకం వెంకటేశ్వరరావు, సొడెం రాజు,కుంజా రమేష్,సున్నం శ్రీరాములు, కురసం రాంబాబు, ఎంఈవో సురేష్,ధనలక్ష్మి ,
గిరిజన సంఘాల నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
