గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు – మహిళల ఆధ్వర్యంలో ఆటలు, ముగ్గులు, వంటల పోటీలు

గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో సంప్రదాయ ఆటలు, రంగురంగుల ముగ్గుల పోటీలు, వంటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల కోసం వన్ మినిట్ గేమ్స్ నిర్వహించి, వారికి బహుమతులు అందించనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు ఈరోజు ఎమ్మెల్యే రాము గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా మహిళలే వ్యవహరించడం విశేషం.

ఈ కార్యక్రమాన్ని పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, వీర మహిళ పడాల సౌమ్య, గుడివాడ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు మండ దీవెన, బీసీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దారం నాగరాణి, బీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కుంభం నాగమణి, పొట్లూరి రమాదేవి (టీచర్), అడ్వకేట్ కొలుసు సునీత, దర్శి లక్ష్మికుమారి, వేమూరి ప్రతిమ, మరీదు కృష్ణకుమారి, అట్లూరి లక్ష్మీ ప్రసన్న తదితరులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మహిళల ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణకు ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.

WhatsApp Join Now
Youtube Subscribe