ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.

అదే విధంగా, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాలోకి, రాజంపేటను కడప జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు మార్చే ప్రతిపాదనలను కూడా క్యాబినెట్‌ ఆమోదించింది.

WhatsApp Join Now
Youtube Subscribe