రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం నాడు చిన్నమండెం మండలంలోని చాకిబండ గ్రామంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి కార్యకర్తలకి స్వయంగా వెళ్లి వారిని పరామర్శించారు. అలాగే గ్రామస్థులతో సంభాషిస్తూ వారి సమస్యలు, అభ్యర్థనలు గురించి వివరంగా తెలుసుకున్నారు.చాకిబండ గ్రామంలో మంత్రివర్యుల పర్యటన సందర్భంగా టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై, ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి, ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు చేరే విధానంపై అవగాహన కల్పించారు. ఇలాకాలోని పలువురు అభిమానులు, మహిళలు, యువత అతనిని కలసి తమ సమస్యలను వినిపించారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
