PM Rahat Scheme 2026 ప్రారంభం – రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి 1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స

కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ప్రజలకు ఆదరణగా PM Rahat Scheme 2026ను ప్రారంభించింది. ఈ సర్కార్ పథకం కింద, ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల వరకు గాయపడిన బాధితులకు అత్యవసర క్యాష్‌లెస్ చికిత్స అందిస్తుంది. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రులలో వర్తిస్తుంది, అలాగే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 📞 112కి కాల్ చేయవలసిన సూచన ఉంది. గోల్డెన్ అవర్‌లో (ప్రారంభ 1–2 గంటల్లో) తక్షణ చికిత్స అందించడం వల్ల గాయపడిన వారి ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువ అవుతాయని అధికారులు సూచిస్తున్నారు.

ఈ పథకం ప్రమాద సమయంలో అత్యవసర వైద్య సదుపాయాలను అందించడంతో పాటు, బాధితులకు ఆర్థిక భారం లేకుండా తక్షణ సేవలను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.

WhatsApp Join Now
Youtube Subscribe