రేపల్లె మున్సిపాలిటీ 5వ (ఎస్‌.టి) & 6వ (ఎస్‌.సి) వార్డుల అంగన్వాడి కేంద్రాలకు విద్యా సామగ్రి పంపిణీ

రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు (ఎస్‌.టి) మరియు 6వ వార్డు (ఎస్‌.సి) అంగన్వాడి కేంద్రాలలో చిన్నారుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సామాజిక నాయకుడు శ్రీ గూడపాటి శ్రీనివాసరావు చిన్నారులకు పలకలు, పెన్సిల్స్, బలపాలు, క్రేయాన్స్, అలాగే టేబుల్స్, కుర్చీలు వంటి విద్యా సామగ్రిని అందజేశారు. చిన్నారులు సంతోషంతో ఈ సామగ్రిని స్వీకరించి, ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ గూడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదిలా ఉంటాయని, సమాజం మొత్తం వారి విద్యాభివృద్ధికి సహకరించాలన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఎం. సుచిత్ర గారు (సీడీపీఓ), సి. హెచ్. హిమబిందు (సూపర్వైజర్), టి. రాధికా (సూపర్వైజర్), అంగన్వాడీ కార్యకర్త శిరీష, అంగన్వాడీ సహాయకులు, స్థానిక నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక సమాజానికి, చిన్నారుల శిక్షణ, విద్యాాభివృద్ధికి కీలకంగా నిలిచింది.

WhatsApp Join Now
Youtube Subscribe