“ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే” – ప్రచారాలకు మంత్రి లోకేశ్ కౌంటర్

భారత్‌–పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు ప్రభుత్వ ఖర్చులతో వెళ్లారన్న ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, మ్యాచ్‌ కోసం కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశారంటూ వచ్చిన ప్రచారాలపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా’’ అంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు విమర్శలు, మరోవైపు మద్దతు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగంపై స్పష్టత అవసరమని ప్రతిపక్షం అంటుండగా, వ్యక్తిగత ఖర్చులేనని లోకేశ్ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ రాజకీయ వాదోపవాదాలకు దారితీశాయి.

WhatsApp Join Now
Youtube Subscribe