విశాఖపట్నం తీరంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) ఘనంగా కొనసాగింది. ఆరు వరుసల్లో మొత్తం 71 యుద్ధ నౌకలు అద్భుత పరేడ్ నిర్వహించగా, కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, రాష్ట్రపతి ఐఎన్ఎస్ సుమేధ నౌకపై సమీక్ష నిర్వహించారు.
ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విశాఖ తీరంలో నౌకాదళ శక్తి, క్రమశిక్షణను ప్రతిబింబించిన ఈ వైభవం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
