విశాఖపట్నంలో మహా శివరాత్రి సందర్భంగా శివభక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. టీటీడీ అడ్వైజరీ బోర్డు చైర్మన్, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం లాసన్స్ బే కాలనీ బీచ్ వద్ద శివరాత్రి జాగారం చేసి సముద్ర స్నానానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహా శివరాత్రి రోజున పరమశివునికి అభిషేకం చేసి రాత్రి జాగారం చేసి, మరుసటి రోజు సముద్ర స్నానాలు ఆచరించిన భక్తులకు మహాశివుని ఆశీస్సులు మెండుగా లభిస్తాయని తెలిపారు. శివభక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఆచారాలు సమాజానికి సత్సంస్కారాలను అందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భైరెడ్డి పోతన రెడ్డి, గేదెల నాగరాజు, బైరెడ్డి గోవింద రెడ్డి, నెక్కంటి సత్తిబాబు, గొలగాని రామారావు, చిన్నపిల్లి నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
