అమరావతి: ఏపీలో 1–19 ఏళ్ల పిల్లలకు ఉచిత నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

అమరావతి: ఏపీ రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలలో నేడు 1 నుండి 19 ఏళ్లలోపు విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు (Albendazole 400MG) పంపిణీ జరుగుతోంది. మొత్తం సుమారు 1.11 కోట్ల మంది పిల్లలకు ఈ మందులు అందించబడనున్నాయి.

నులిపురుగుల వల్ల వచ్చే సమస్యలు:
❌ ఆకలి తగ్గడం
❌ కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు
❌ రక్తహీనత
❌ ఎదుగుదల లోపం

ఆల్బెండజోల్ మాత్రల ద్వారా నులిపురుగులను నివారించి, పిల్లల ఆరోగ్యాన్ని సురక్షితం చేయవచ్చు.

తల్లిదండ్రులకు సూచన:
పిల్లలు ఈరోజు తప్పకుండా తమ స్కూల్ లేదా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి ఈ మాత్రలు తీసుకోవాలి.

ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తగ్గి, ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తోడ్పడుతుంది.

WhatsApp Join Now
Youtube Subscribe