జాక్స్‌ మెరుపు హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్‌ 202/7 – ఇటలీకి 203 లక్ష్యం

కోల్‌కతాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ శక్తివంతమైన స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. విల్ జాక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని 22 బంతుల్లో 53* పరుగులు సాధించాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

ఇతర బ్యాటర్లలో టామ్ బాంటన్ 30, ఫిలిప్ సాల్ట్ 28, సామ్ కరన్ 25, జాకబ్ బెతెల్ 23 పరుగులతో జట్టు స్కోర్‌ను బలోపేతం చేశారు. జాస్ బట్లర్ మాత్రం 3 పరుగులకే పరిమితమయ్యాడు. చివర్లో జెమీ ఓవర్టన్ 15, హ్యారీ బ్రూక్ 14 పరుగులు జోడించారు.

ఇటలీ బౌలర్లలో క్రిషన్, గ్రాంట్ స్టీవర్ట్ తలో రెండు వికెట్లు తీశారు. స్మట్స్‌, అలీ హసన్, బెన్ తలో వికెట్ సాధించారు. 203 పరుగుల లక్ష్యంతో ఇటలీ బరిలోకి దిగనుంది. మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

WhatsApp Join Now
Youtube Subscribe