అంధురాలు శిరీషకు చారిటీ బాక్స్ సాయం – రూ.16,500 సౌండ్ బాక్సు వితరణ

పేదరికం, కొడుకు అనారోగ్యంతో కష్టాలు ఎదుర్కొంటున్న నగరానికి చెందిన అంధురాలు శిరీషకు చారిటీ బాక్స్ ద్వారా సహాయం అందింది. స్ట్రీట్ ఆర్కెస్ట్రా కార్యక్రమాలకు వెళ్లేందుకు అవసరమైన రూ.16,500 విలువైన సౌండ్ బాక్సును సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆజంఖాన్ చేతుల మీదుగా శుక్రవారం వితరణ చేశారు.

ఈ సౌండ్ బాక్సు కొనుగోలుకు చారిటీ బాక్స్ సభ్యులు తమవంతు సహకారం అందించారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా కొడుకు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శిరీష సంకల్పం అభినందనీయం అని ఆజంఖాన్ పేర్కొన్నారు. గుండె అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కుమారుడి చికిత్స కోసం ఈ సాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లుగా చారిటీ బాక్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో లక్కోజు నూకరాజు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe