బెల్లంపల్లిలో అభయ ఆంజనేయ స్వామి సన్నిధిలో శివార్చన – ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు

బెల్లంపల్లి మున్సిపాలిటీలో 1వ వార్డు కన్నాలబస్తీ సమీపంలోని అభయ ఆంజనేయ విగ్రహం వద్ద ఉన్న పరమశివుడు విగ్రహానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రీస్వామి, కొలిపక శ్రీనివాస్ పాల్గొన్నారు.

అనంతరం భక్తజనులతో పెద్దఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిలవేరు నర్సింగం, బెల్లంపల్లి పద్మశాలి సంఘం నాయకులు మెరుగు ప్రభాకర్, ప్రముఖ వ్యాపారులు ఆనంద్ లోయ, కమల్ కిషోర్ సర్దా, బారె సంపత్, రాకేష్ రాజు, గంపల చంద్ర మోగిలి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం భక్తి భావంతో, సామూహిక సేవా స్పూర్తితో కొనసాగింది.

WhatsApp Join Now
Youtube Subscribe