నేషనల్ స్కాటో బాల్‌లో పెనమలూరు పిల్లల మెరిసిన ప్రతిభ – ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు

పెనమలూరు: చిన్న వయసులోనే ప్రతిభ చాటి నియోజకవర్గానికి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని షిరిడీలో గత నెల 31 మరియు ఈ నెల 1వ తేదీల్లో నిర్వహించిన 11వ ఏరో స్కాటో బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బిగ్ ఛాంపియన్ స్కేటింగ్ అకాడమీకి చెందిన పెనమలూరు నియోజకవర్గం పిల్లలు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-10 మరియు అండర్-12 విభాగాల్లో పోటీ చేసిన 11 మంది విద్యార్థులు మొత్తం 26 మెడల్స్ సాధించడం విశేషం.

ఈ విజయాన్ని పురస్కరించుకొని కోచ్ షేక్ ఖాదర్ భాషా మరియు పిల్లలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందించారు. స్పీడ్ రేస్, స్కేట్ వాక్, జిగ్ జాగ్, హర్డిల్స్ వంటి వ్యక్తిగత విభాగాల్లో 15 మెడల్స్ (6 గోల్డ్, 7 సిల్వర్, 2 బ్రాంజ్) రాగా, గ్రూప్ గేమ్స్‌లో 11 సిల్వర్ మెడల్స్ సాధించారు. ప్రతి పోటీలోనూ మెడల్స్ అందుకున్న కుందనిక బొల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి 1 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాంజ్ గెలుచుకుంది.

పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మెడల్స్ రావడం గర్వకారణమని కోచ్ షేక్ ఖాదర్ భాషా తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తమ పిల్లలు వేరే రాష్ట్రంలో సత్తా చాటడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంతో పెనమలూరు నియోజకవర్గం క్రీడా రంగంలో మరో మైలురాయి నమోదు చేసుకుంది.

WhatsApp Join Now
Youtube Subscribe