నందలూరు–రాజంపేటలో వీరబల్లి జయకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

నందలూరు మండలం మరియు రాజంపేట పట్టణంలో రాయలసీమ క్రైమ్ అండ్ డ్రగ్స్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు, స్నేహితులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. నాగిరెడ్డిపల్లి డీఎంసీ రోడ్డులోని Human Rights Protection Council of India ప్రాంతీయ కార్యాలయంలో నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల సమక్షంలో వేడుకలు కొనసాగాయి. నాగిరెడ్డిపల్లి రైల్వే గేటు వద్ద అభిమానులు ప్రత్యేకంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని జయకుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Youtube Subscribe